SSMB28: మహేష్ బాబు సినిమా అందుకే ఆలస్యం అవుతుందా..?

UPDATED 14th NOVEMBER 2022 MONDAY 9:15 PM

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేయగా, తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ఆలస్యానికి కారణం ఉందంటూ ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మహేష్‌తో తొలి షెడ్యూల్‌ను షూట్ చేసిన త్రివిక్రమ్, ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్టుకు సంబంధించి పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను రాసుకున్న స్క్రిప్టును పూర్తిగా మార్చి, సరికొత్త కథతో రాబోతున్నాడట త్రివిక్రమ్. తాను షూట్ చేసిన తొలి షెడ్యూల్‌ను కూడా క్యాన్సిల్ చేసి, ఇప్పుడు సరికొత్తగా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ వార్తతో మహేష్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us