UPDATED 10th MARCH 2022 THURSDAY 09:00 PM
Radheshyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ రేపు మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం : 36.50 కోట్లు సీడెడ్ : 18 కోట్లు ఉత్తరాంధ్ర : 13 కోట్లు ఈస్ట్ : 8.80 కోట్లు వెస్ట్ : 7.50 కోట్లు గుంటూరు : 9.90 కోట్లు కృష్ణా : 7.50 కోట్లు నెల్లూరు : 4 కోట్లు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక : 12.50 కోట్లు తమిళనాడు : 6 కోట్లు కేరళ : 2.10 కోట్లు హిందీ : 50 కోట్లు రెస్టాఫ్ ఇండియా : 3 కోట్లు ఓవర్సీస్ : 24 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ‘రాధేశ్యామ్’ సినిమా మొత్తం 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సినీ వర్గాలు. మొదటి వారంలోనే ఈ సినిమా దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ తో మరో వంద కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.







