AP News: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

Updated 30 January 2022 Sunday 05:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. అయితే మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 310 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9వేల 692 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

కడప, విశాఖపట్నం జిల్లాలలో కోవిడ్ తో ముగ్గురు చొప్పున మరణించారు. నెల్లూరులో ఇద్దరు చనిపోయారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,16,031 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల 296మందికి కరోనా టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా 1697 కరోనా కేసులు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో 1379, కృష్ణా జిల్లాలో 1008 కరోనా కేసులు నమోదయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us