UPDATED 3rd MARCH 2018 SATURDAY 6:30 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనసేన నాయకులు తుమ్మల రామస్వామి(బాబు) హాజరై మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటంలో జనసేన ముందుంటుందని అన్నారు. సీపీఎం, సీపీఐ పట్టణ కార్యదర్శులు కరణం ప్రసాదరావు, సీపీఐ పెదిరెడ్ల సత్యనారాయణ, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను, కాంగ్రెస్ నాయకులు భావన్నారాయణ, సీఐటీయూ అధ్యక్షుడు తుంపాల శ్రీనివాస్, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు యువరాజు, ఏడీఐ అధ్యక్షుడు పవన్, దుప్పట్ల సంఘము అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి కార్యదర్శి కరణం గోవిందరాజు, వి. కొండలరావు, నమ్మి భద్రరావు, బాలం శ్రీనివాస్, సీపీఐ నాయకుడు రామదాసు, బోదకొండ, వైసీపీ నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ, జనసేన వాసు తదితరులు పాల్గొన్నారు.







