పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు జ్ఞానభూమి స్మార్ట్ పోర్టల్

UPDATED 11thJUNE 2017 SUNDAY 11:45 AM

కాకినాడ: జిల్లాలో 35 వేల మంది పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ప్రయోజనం కల్పించే ఉపకార వేతన పంపిణీని జ్ఞానభూమి స్మార్ట్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన విధానం అమలు ద్వారా విద్యార్థులు కళాశాలలో ప్రవేశించే సమయంలోనే నిర్ణీత వివరాలు ఆన్ లైన్ లో నమోదవుతాయని, తద్వారా బయోమెట్రిక్ హాజరు ఆధారంగా ఉపకారవేతనాల చెల్లింపు జరుగుతుందని, ఇప్పటి వరకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పంపిణి ఏపీ ఈ-పాస్ ద్వారా మంజూరు చేస్తున్నారన్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థి కళాశాలలో చేరిన తర్వాత ఒకటి, రెండు నెలల్లో నెట్ సెంటర్ లో ఆన్ లైన్ ద్వారా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి మంజూరయ్యేదని, ప్రస్తుత నూతన విధానం ద్వారా విద్యార్థులు నెట్ సెంటర్ లో నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఉపకార వేతనాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా చెల్లిపు కోసం నూతన సాఫ్ట్ వేర్ ను  రూపొందించారని దీనికోసం ప్రతీ కళాశాలలో ప్రవేశ సమయాలలో ఉపకార వేతనం కోసం (జె -ఎస్ ఏ ఎఫ్ ) ఆన్ లైన్ దరఖాస్తును విద్యార్థులు పూర్తి చేసి ఇవ్వడం ద్వారా సంబంధిత కళాశాల యాజమాన్యం విద్యార్థి ఉపకార వేతన దరఖాస్తులు జ్ఞానభూమి వెబ్ పోర్టల్ లో విద్యార్థి చేరిన 15 రోజులు లోపు ఆన్ లైన్ లో సమర్పిస్తారన్నారు . 2017 -18 సంవత్సరం నుంచి ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ ఆ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఉపకార వేతనానికి దరఖాస్తు చేసిన లేదా చేయని ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థుల అందరి వివరాలను జ్ఞానభూమి వెబ్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. ఆ కళాశాలలో జె -ఎస్ ఏ ఎఫ్ ద్వారా ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్ సి, ఎస్ టి, బిసి, ఈబీసి, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు అందరి వివరాలు ప్రిన్సిపాల్ సంబంధిత సంక్షేమశాఖలకు ఆన్ లైన్ లో పంపిస్తారని కలెక్టర్ తెలిపారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తును తెల్ల రేషన్ కార్డు లేదా మీ-సేవ ఆదాయ ధృవపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ తో పాటు సెల్ నెంబర్ , ఈ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ నూతన జ్ఞానభూమి వెబ్ పోర్టల్ మూలంగా ఇప్పటి వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. 
           
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us