Nirmala Seetharaman : శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్

UPDATED 20th OCTOBER 2022 THURSDAY 08:00 PM

Nirmala Seetharaman : కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవీ. సుబ్బారెడ్డి, ఈవో ఎవీ .ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మలా సీతారామన్ కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపి డాక్టర్ గురుమూర్తి, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు భానుప్ర‌కాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us