UPDATED 21st OCTOBER 2017 SATURDAY 6:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొన్నారు. ముందుగా విధి నిర్వహణలో అమరులయిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడూతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారని, పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగలను మనం గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించటం అనేది మనకు 1959 నుంచి సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు. అనంతరం డీఎస్పీ చిలకా వెంకట రామారావు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను దేశం మరిచిపోదని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు పెద్దాపురం పోలీసులు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ ఐ. కృష్ణ భగవాన్, రిటైర్డ్ ఏఎస్.ఐ పుప్పాల రామకృష్ణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు







