మరిడమ్మ హుండీ ఆదాయం రూ.2.20 లక్షలు

UPDATED 21st JUNE 2017 WEDNESDAY 11:30 AM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మూడు నెలల కాలానికి రూ.2,20,390 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.పుష్పనాథం తెలిపారు. అమ్మవారి జాతర ఈ నెల 23 నుంచి జరగనున్న నేపథ్యంలో ముందుగా ఈ హుండీలను లెక్కించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వివి పళ్ళంరాజు, ట్రస్టీలు ఆకుల మురళీ కృష్ణ, కొంగర సత్యనారాయణ, తమ్మన మైనర్ బాబు, కోఠాని గణేష్, గోలి శ్రీరాములు, రాయి విజయ్, వేదపండితులు చిట్టెం హరిగోపాలశర్మ, వెంకట శాస్త్రి, భానుమూర్తి, ప్రసాద్ శర్మ, నాని, శివ, గౌరీ, వరహాలు, సురేష్, లోవ, శ్రీనివాస భక్తమండలి సభ్యులు కొత్త వీరభద్రరావు, దాసరి సత్యనారాయణ, తమ్మన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us