మంచిర్యాల (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం ఒకరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. గాలిపటం మాంజా వల్ల గొంతు తెగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణలోని మంచిర్యాలలో చోటు చేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా గాలిపటానికి కట్టిన మాంజా వాహనం నడుపుతున్న వ్యక్తి మెడకు చుట్టుకుంది. బైకు వేగానికి మాంజా వాహనదారుడికి మెడకు బిగుసుకుపోయి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే భర్త గొంతు తెగి చనిపోవడంతో భా కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.







