TS News: టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 1న వారికి ఉచిత ప్రయాణం!

హైదరాబాద్ ‌(రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: కొత్త ఏడాదిని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. జనవరి 1వ తేదీన 12 ఏళ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలతోపాటు ప్రయాణించే తల్లిదండ్రులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us