UPDATED 6th SEPTEMBER 2017 WEDNESDAY 5:00 PM
అన్నవరం: సత్యదేవుని దివ్య సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కుటుంబ సమేతంగా హాజరై బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఈరంకి జగన్నాథరావు, వేద పండితులుతో కలిసి ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సతీసమేతంగా సత్యదేవుని వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందచేసి సత్యదేవుని చిత్రపటాన్ని, ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, పీఆర్వో తులా రాముడు, తదితరులు పాల్గొన్నారు.







