విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: నగర పర్యటనకు వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం సాయంత్రం హిందుస్థాన్ షిప్‌యార్డుని సందర్శించారు. సంస్థలోని స్టీల్‌షాపు, బిల్డింగ్ డాక్, రిపేర్స్‌డాక్ తదితర ప్రధాన విభాగాల్లో పర్యటించారు. యార్డులో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక వెసల్స్ వివరాలను సంస్థ సీఎండీ హేమంత్‌ఖత్రీ వివరించారు. ఆమె షిప్‌యార్డు కాలనీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించి... నమూనా నౌకలను పరిశీలించారు.







