UPDATED 12th DECEMBER 2017 TUESDAY 6:30 PM
గండేపల్లి: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా బాడ్మింటన్ సంఘ సభ్యుడు, ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంచార్జి మేడపాటి భాస్కర చంద్రారెడ్డి (భాస్కర్ రెడ్డి) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో మేడపాటి భాస్కర చంద్రారెడ్డి (భాస్కర్ రెడ్డి) తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం తన జన్మదినోత్సవం నాడు మొక్కలు నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, గత 15 సంవత్సరాలుగా ప్రతీ పుట్టినరోజున మొక్కలు నాటుతున్నానన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె.రవిశంకర్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, సి.ఎ.వో పి.వి.వి.ఎన్.ఎస్. కృష్ణమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియచేశారు.







