రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తున్నారు: జీవీఎల్

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1.45లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.86 వేల కోట్లు అప్పు చేస్తే .. రెండున్నరేళ్లలో అంతకు రెట్టింపు అప్పులు చేశారని మండిపడ్డారు. చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఓటు బ్యాంకు, రాజకీయ అవసరాలకోసం మాత్రమే ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందని జీవీఎల్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర రాజకీయం, ఆర్థిక పరిస్థితులపై కోర్‌కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us