కర్నూలు (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్లలో కట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారి పింఛన్లను తీసేవేయడానికి వలంటీర్లను సీఎం జగన్కాపలా పెట్టాడని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయల నిధులను ఏపీకి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలో జగన్ ఒక్క ఆర్ అండ్ బీ రోడ్డు కూడా వేయలేదని ఆయన విమర్శించారు.







