విశాఖలో బీరు బాటిళ్లు, కత్తితో యువకుడి హల్‌చల్‌

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021 : విశాఖ నగరంలోని ఎండాడ పెట్రోల్‌ బంక్‌ వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. కత్తిపట్టుకుని అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. యువకుడి వీరంగంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. కాసేపటికి బీరు బాటిళ్లు పగులగొట్టి జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులను అడ్డగించాడు. ఓ కారు అద్దం కూడా పగులగొట్టాడు. కొందరు స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు అప్పగించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us