UPDATED 5th JANUARY 2018 FRIDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా స్థానిక సూరంపాలెం పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ జె.ఎన్.టు.యూ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్ హాజరై మాట్లాడారు. మనం నివసించే గ్రామం స్వచ్ఛంగా ఉండాలని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు కబడ్డీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జె.ఎన్ఎ.టి.యూ ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె. శ్రీకుమార్, కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ కె.రాజా, ఎం.పి.టి.సి కె. చిన్నిబాబు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







