నిబంధనలు అతిక్రమించిన ఆక్వా చెరువులను తొలగించాలి

జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి  

UPDATED 27th DECEMBER 2019 FRIDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జనావాసాలకు దగ్గరలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఫిషరీస్ జెడి పి. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మురళీధరరెడ్డి  మాట్లాడుతూ మంచినీటి ఆక్వా చెరువులకు ఇంతవరకు 7901.88 ఎకరాలలో 314 దరఖాస్తులు, ఉప్పునీటి రొయ్యల చెరువులు నిమిత్తం 386 హెక్టార్లలో 259 దరఖాస్తులు వచ్చాయని, అలాగే ఆక్వా జోన్ లో లేని చెరువుల కోసం 248 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆక్వా చెరువులను క్రమబద్దీకరించేందుకు వచ్చేనెల నాల్గవ తేదీ వరకు గడువు ఉందని, గడువు తర్వాత వచ్చిన దరఖాస్తుదారులకు కమర్షియల్ ఛార్జీలు  విధించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రౌండ్ వాటర్ ఏడి టి.వి.వి. సత్యనారాయణ, అగ్రికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us