Crime News: గుంటూరు జిల్లాలో దారుణం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్‌ దాడి

పెదనందిపాడు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరమణపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. పెదకూరపాడులోని అత్తారింటికి వెళ్లివస్తుండగా మార్గమధ్యలో బోయపాలెం వద్ద ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన వెంకటనారాయణను గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను వెంకటనారాయణ నిలదీసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి ఘటనకు దారితీసింది. స్థానికుల సమాచారంతో తీవ్రంగా గాయపడిన వెంకటనారాయణను 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. దాదాపు 40శాతంపైగా చేతులు, ముఖం, ఛాతి భాగం కాలిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రశ్నిస్తే.. చంపేస్తారా?: లోకేశ్‌

గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ దళిత కార్యకర్త వెంకటనారాయణపై వైసీపీ దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. జగన్‌ జన్మదిన వేడుకల్లో చంద్రబాబును దూషిస్తున్న వైసీపీ కార్యకర్తలను ప్రశ్నిస్తే.... మద్యం సీసాలతో నారాయణను విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. తప్పు చేస్తుంటే వద్దని వారిస్తే చంపేస్తారా? అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తమను ప్రశ్నించే వారే ఉండకూడదు.. ఎదురించే వారు బతికే ఉండకూడదనేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us