UPDATED 4th MARCH 2018 SUNDAY 7:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట- పెద్దాపురం రోడ్ లో ఉన్న సిరి విభిన్న ప్రతిభావంతుల కేంద్రంలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ పుట్టినరోజు వేడులకు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి పిల్లలకు రొట్టెలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, అత్తిలి వెంకట సీతారామస్వామి, కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్, పితాని సూర్యనారాయణ, నేతల హరిబాబు, ఎలిశెట్టి నరేష్, కరణం భాను, సాయి, తదితరులు పాల్గొన్నారు.







