ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినవేడుకలు

UPDATED 20th MAY 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక స్టేషను సెంటర్ లో టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. సూర్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ డి. వెంకటేష్, సెక్రెటరీ ఎ. అవినాష్, ట్రెజరర్ ఎన్. నాగేంద్రకుమార్, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us