పర్యావరణ పరిరక్షణలో అమరావతి స్కూల్ సేవలు అభినందనీయం

UPDATED 7th FEBRUARY 2018 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణలో అమరావతి స్కూల్ సేవలు అభినందనీయమని అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని అమరావతి స్కూల్ కరస్పాండెంట్ జి.వి.వి. వీర్రాజు ఆర్ధిక సహాయంతో మొక్కల సంరక్షణ కోసం సమకూర్చిన మినీ వాటర్ టాంకర్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మొక్కలు సంరక్షణలో అమరావతి స్కూల్ చేస్తున్న కృషి అభినందనీయమని, పచ్చదనంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, ఎంపిటిసిలు అడపా గంగాధర్, గుత్తుల సూర్యావతి శ్రీనివాస్, నీటి సంఘం అధ్యక్షుడు యేలేటి సుబ్బారావు, మన్యం దేవబాబు, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us