UPDATED 21st FEBRUARY 2022 MONDAY 05:50 PM
Jagananna Thodu : ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడవ విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది ప్రభుత్వం.
ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనునుంది.







