పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల రాస్తారోకో

UPDATED 9th JUNE 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపుకు నిరసనగా వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు శనివారం స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాస్తారోకోను ఉద్దేశించి వామపక్ష నాయకులు మాట్లాడుతూ 2014లో అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 109 డాలర్లు ఉంటే, నేడు కేవలం 49డాలర్లే ఉన్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడమేమిటని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేరళ ప్రభుత్వం పన్నులు తగ్గించుకుని ప్రజలపై సాధ్యమైనంతమేర భారాలు తగ్గిస్తోందని, అలాగే రాష్ట్రంలోనూ పన్నులు తగ్గించాలన్నారు. ఒకపక్క జరిమానాలు, మరోపక్క చమురు ధరలతో రవాణారంగం కుదేలవుతోందన్నారు. ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వాలు నేడు పెంచుకుంటూ పోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌కు వెనుకాడమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కరణం ప్రసాదరావు, నీలపాల సూరిబాబు, తుంపాల శ్రీనివాస్, బాలం శ్రీనివాస్, ఎలిశెట్టి రామదాసు, బత్తుల బాలాజీ, కామిరెడ్డి, బోడకొండ, దారబాని కృష్ణ, దారపురెడ్డి, డి.సత్యనారాయణ, కరణం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us