RRR Movie: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్.. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం.. జనవరి 7 నుండి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మార్చి 25 న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు.







