UPDATED 15th SEPTEMBER 2022 THURSDAY 03:30 PM
Telangana Secretariat: తెలంగాణలో కొత్తగా నిర్మాణమవుతున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత జీవోను ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. ‘‘అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణకు గర్వకారణం. ఈ నిర్ణయం దేశానికి ఆదర్శం. ఢిల్లీలో నూతనంగా నిర్మాణమవుతున్న పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలి. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే విషయమై ప్రధాని మోదీకి త్వరలోనే లేఖ కూడా రాస్తా’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ను ఆదేశించారు.







