Viral Photos: తవ్వకాల్లో బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు.. ఫొటోలు వైరల్!

UPDATED 10th SEPTEMBER 2022 SATURDAY 09:00 PM

Viral Photos: అనంత విశ్వం ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిళ్లని మనకు తెలుసు. ఇందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికితే.. మరికొన్నింటికి దొరకవు. అందులో ‘రక్తపిశాచి’ ఆనవాళ్లు ఒకటి. ఇవి నిజంగా ఉన్నాయా? అంటే.. అలాంటివి బయటెక్కడా కనిపించవ్.. ఒక్క సినిమాల్లో తప్ప. అయితే.. గతంలో అవి నిజంగా ఉన్నట్లు తెలిపే ఆనవాళ్లైనా.. వాటి అస్థికలు తవ్వకాల్లో బయటపడ్డాయి.

ఆ వివరాలు.. పోలాండ్, టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఇలాంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ అనే గ్రామంలోని ఓ స్మశానానికి అనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఒక సమాధిని గుర్తించారు. ఆపై.. తవ్వకాలు జరిపి.. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. అందువల్లనే దీన్ని రక్తపిశాచిగా అనుమానిస్తున్నారు. ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలను తాజగా బయటపెట్టారు. ఈ విషయంపై పరిశోధకులు ఏమంటున్నారంటే.. 17వ శతాబ్దంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని రక్త పిశాచిగా అనుమానించి చంపేసి ఉంటారని చెప్తున్నారు. ఒకవేళ సమాధిలో పూడ్చిపెడితే.. ఎక్కడ లేచి వస్తుందో అన్న భయంతోనే మెడలో కొడవలిని అలాగే ఉంచేసినట్లు వెల్లడించారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారని పేర్కొన్నారు.

రక్త పిశాచి ఎలా ఉంటుంది? దాని సంకేతాలేంటి?

ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే.. వాటిని చూసిన వారు ఇప్పుడు బతికి లేరు కనుక. నిజానికి కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచే.. రక్త పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలుకే కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. ముఖంపై చారలు, చారలుగా గాట్లు ఉండి నోరు మూసినప్పటికీ, కంటి పళ్ళు ఎల్లప్పుడూ పెదవి పైన పొడుచుకు వస్తాయని కొందరు చెప్తుంటారు. కానీ బాధితుడిని చూసినప్పుడు, రక్తం తాగాలి అనిపించినప్పుడు మాత్రమే కోరలు పెరుగుతాయనేది మరికొందరి వాదన.

అలా దాడిచేసినపుడు మెడపై గనుక కొరికితే.. అవతలి వాళ్లూ రక్తపిశాచిలుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని చెప్తుంటారు. అయితే.. గతంలో వీటి మనుగడ ఉన్నదా! అంటే.. అందుకు తగ్గ శాస్త్రీయ అధరాలు ఎక్కడా లేవు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us