గైట్ క్యాంపస్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీపై వర్క్ షాప్

UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 5:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) కళాశాల క్యాంపస్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీపై రెండు రోజులు పాటు జరగనున్నవర్క్ షాప్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రపంచ డిజిటల్ విభాగంలో అత్యాధునిక సాంకేతిక విప్లవమని, ప్రస్తుతం అనేక అవకాశాలున్న ఐ.టి. రంగంలో బ్లాక్ చైన్ టెక్నాలజీపై పట్టు సాధించిన యువతకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. క్యాంపస్ లోని విద్యార్థులకు మెరుగైన నైపుణ్యం సాధించే విధంగా తర్ఫీదు ఇవ్వడంలో భాగంగా నిష్ణాతులైన నిపుణులతో విద్యార్థులకు ఈ టెక్నాలజీపై విశ్లేషణ, నియంత్రణ, ప్రాజెక్టులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాప్ కు హాక్ మేనియా సి.టి.వో ప్రశాంత్ విశ్వనాథం ముఖ్య ఉపన్యాసకులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ శిక్షణ పొందిన విద్యార్థులకు రాబోయే రెండు, మూడు నెలల్లో మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నందువల్ల ఈ వర్క్ షాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సుమారు ఐదు వందల మంది విద్యార్దులు పాల్గొనే ఈ కార్యక్రమం 16 గంటల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, డాక్టర్ జి. రవి, టైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ కె. వల్లీ మాధవి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us