గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 9 : ఏజెన్సీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అసౌకర్యం కలిగిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య హెచ్చరించారు. అడ్డతీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ నీరు బయటకు పంపే చర్యలు, రోగులకు త్రాగునీరు, రన్నింగ్ వాటర్, రోగులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వార్డులలో ఉన్న రోగులకు వైద్య సౌకర్యాలు, ప్రతిరోజు రోగులకు ఆహారం ఏవిధంగా సరఫరా జరుగుతోందో తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏరోజుకు ఆరోజు వచ్చే చెత్తను వెంటనే తొలగించాలని, ఆసుపత్రి చుట్టుపక్కల దోమలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ప్రసవానికి పదిహేను రోజుల ముందు సుఖ ప్రసవాలకు గర్భిణీ స్త్రీలను అడ్మిట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వైద్య సేవల కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నది, ఆరోగ్య పరిస్థితి, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నదీ లేనిది తదితర వివరాలు గర్భిణీ స్త్రీలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు సంబంధించిన బర్త్ వెయిటింగ్ హాల్లో బెడ్స్ పెంచాలని సంబంధిత వైద్యాధికారులను పీవో అధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీవో వెంట తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో బాపన్నదొర, సీడీపీవో మాధవి, వద్యాధికారులు, డాక్టర్ అనూష, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.







