మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Updated: 11th April 2017 Tuesday 4:00PM
పెద్దాపురం : పెద్దాపురం పట్టణంలో ఈ నెల 12 వ తేదీన సుమారు రూ. 6.54 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీనిలో భాగంగా మంత్రుల పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను మంగళవారం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పంచాయతీరాజ్ డి ఈ హరినాథ రావు, ఆర్ అండ్ బి  డిఈ సూర్య ప్రకాశరావు తో పాటు పలువురు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రవాణాశాఖా మంత్రి కింజరపు అచ్చయ్య నాయుడు, పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహంతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీటిలో కోటి రూపాయలతో నిర్మించిన బాలికల వసతి గృహం రూ.రెండు కోట్ల తో నిర్మించిన రహదారులు భవనాల అతిధి గృహాన్ని, ఆర్ టి సి బస్సు కాంప్లెక్స్ , రైతు బజార్, అలాగే రూ. 1.20 కోట్ల తో నిర్మించ తలపెట్టిన ఎంపిడివో కార్యాలయం, హైజెనిక్ మార్కెట్, అగ్నిమాపక భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. డిఎస్పీ ఎస్. రాజశేఖరరావు పర్యవేక్షణలో సిఐ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్ ఐ వై. సతీష్ బందోబస్త్  ఏర్పాట్లను చేపట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us