Omicron: తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021‌: తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కేసుల వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌రావు మీడియాకు వివరించారు. ఒకరిని టిమ్స్‌కు తరలించాం.. మరొకరిని తరలిస్తాం ఈ నెల 12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని.. ఆమెకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు డా. శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ కూడా సేకరించినట్లు తెలిపారు. కెన్యా మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకినట్లు డీహెచ్‌ వెల్లడించారు. అతడిది టోలిచౌకి- మెహిదీపట్నం ప్రాంతంగా గుర్తించామన్నారు. ఆ వ్యక్తిని మరికొద్ది గంటల్లో గుర్తించి టిమ్స్‌కు తరలిస్తామని వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us