CRIME News: ప్రియురాలు చనిపోయిందనే బాధతో ప్రియుడు...

సిద్దిపేట (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. ధర్మాజీపేట వార్డుకు చెందిన బూరు దేవరాజు (20) ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది. తను ప్రేమించిన అమ్మాయి మరణించిందనే బాధతో మనస్థాపానికి గురై వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us