పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

UPDATED 4th NOVEMBER 2017 SATUDAY 7:00 PM

సామర్లకోట: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని శనివారం మాట్లాడారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. అలాగే దాతల సహకారంతో ట్రీ గార్డులు ఏర్పాటుచేసి మొక్కలు సంరక్షించాలన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, మాగంటి మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, జెడ్పి చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ద్వారానే కాలుష్యాన్ని నివారించవచ్చని, మొక్కలు సంరక్షణ వాటిని పెంచడం ప్రతీ ఒక్కరూ భాద్యతగా భావించాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైతులకు రూ.1.50 లక్షలు సబ్సిడీ పై రూ. 5.61 లక్షలు విలువ గల మూడు ట్రాక్టర్లను ఎంపీ మురళీమోహన్ రైతులకు అందచేశారు. అనంతరం మాండవ్య నారాయణస్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వనసమారాధన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారిణి నందినీ సలారియా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జగ్గంపేట, అమలాపురం, అనపర్తి శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ, అయితాబత్తుల ఆనందరావు, నల్లమిల్లి  రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు , కాకినాడ ఆర్డీవో రఘుబాబు, పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), పెద్దాపురం, సామర్లకోట ఎంపిపిలు గుడాల రమేష్, గొడతా మార్త, జెడ్పిటిసిలు సుందపల్లి శివనాగరాజు, గుమ్మళ్ళ విజయలక్ష్మి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నాను. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us