UPDATED 28th NOVEMBER 2017 TUESDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యానం, యోగముద్రలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పంకజ్ జైన్, స్మైల్ మెడిటేషన్ నిపుణులు సుజోక్, అతిధులుగా షుగర్, హైపర్ టెన్షన్ నిపుణులు డాక్టర్ శశికాంత్ శర్మ, శ్రీరామమూర్తి, ఉపన్యాసకులు హాజరైయ్యారన్నారు. ప్రస్తుత జీవనవిధానంలో మనం ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళను ఈ కార్యక్రమం ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని, శారీరక, మానసిక అంశాల పట్ల సమతౌల్యాన్ని సాధించవచ్చన్నారు. డాక్టర్ పంకజ్ జైన్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో వివిధ రకాలైన భయాలవల్ల ఆందోళనలు, ఒత్తిడి, జ్ఞాపకశక్తి, దృష్టి వికేంద్రీకరణ వంటి అంశాలలో మానవ సమాజం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటోందని, వాటినుంచి ఉపశమనం పొంది సమతౌల్యాన్నిసాధిస్తూ, మంచి అలవాట్లు అలవరచుకుని జీవితాశయాలను సాధించడానికి ప్రధాన సాధనాలుగా మన చేతలను, చిరునవ్వులను ఏ విధంగా ఉపయోగించవచ్చునో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 250 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







