Updated 16th December 2022 Friday 9:40 pm
Avatar 2: హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ముందుగానే టికెట్స్ కొనగోలు చేసుకుని ఆశగా వెయిట్ చేస్తూ వచ్చారు. నేడు థియేటర్లలో ఈ విజువల్ వండర్ మూవీని చూసి వారు సంతోషంతో ఊగిపోతున్నారు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ ట్యాలెంట్‌ను వారు మాటల్లో వర్ణించలేకపోతున్నారు.
ఈ సినిమాపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టయిల్‌లో రెస్పాండ్ అయ్యారు. ఈ సినిమాను చూసిన వర్మ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ సినిమా గురించి చేసిన కామెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్-2ని ఇప్పుడే చూశాను. నిజానికి నేను అవతార్-2లో ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. దీనిని సినిమా అనడం నేరంతో సమానం. ఇలాంటి అద్భుతమైన విజువల్స్, అబ్బురపరిచే యాక్షన్‌తో జీవితకాలం పాటు గుర్తుండిపోయే అనుభూతిని పొందాను. మరో లోకంలో విహరించినట్లుగా అనిపించింది’’ అంటూ వర్మ కామెంట్ చేశాడు.
అవతార్-2 సినిమాపై కామన్ ఆడియెన్స్ నుంచి సెలెబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందా అని సినీ వర్గాలు లెక్కవేస్తున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ పడ్డాయని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.







