పంచారామక్షేత్రంలో శ్రీమార్గ ఆశ్రమ పీఠాధిపతి

UPDATED 7th MAY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో శ్రీమార్గ ఆశ్రమం (భువనేశ్వర్) పీఠాధిపతి దీపా నిరంజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం బాలాత్రిపురసుందరి అమ్మవారికి, భీమేశ్వరస్వామికి దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతికి, హోంమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు పలికి అమ్మవారి, స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు( శ్రీనుబాబు), ధర్మకర్తల మండలి సభ్యులు, దూది రాజుబాబు, పడాల వీరబాబు, సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్.ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us