UPDATED 4th MARCH 2018 SUNDAY 7:30 PM
సామర్లకోట: ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహణే లయన్స్ క్లబ్ లక్ష్యం అని క్లబ్ రీజినల్ చైర్మన్ ఈదల ఈశ్వర్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక పెన్షన్ లైన్ లోని లక్ష్మినందనంలో రీజియన్ పరిధిలోని క్లబ్ ల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు నేతి వీరభద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రీజినల్ చైర్మన్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసమే లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్లబ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయి 101వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. కోనసీమ నుంచి మెట్ట ప్రాంతం వరకు రీజియన్ పరిధిలో 12 లయన్స్ క్లబ్బులు ఉన్నాయన్నారు. అనంతరం ఈశ్వర్ కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ బి.వి.ఎన్. రెడ్డి, వైస్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి , ఎస్.వి.వి. సత్యన్నారాయణ, మాజీ గవర్నర్లు బాదం బాలకృష్ణ, కోడూరి రంగారావు, గోలి శ్రీరాములు, జిల్లా సభ్యులు డాక్టర్ వి.ఎస్.వి.డి. శివప్రసాద్, దాసరి తిరుమల రావు, డాక్టర్ సి.హెచ్. అనంత పద్మనాభం, జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు, సామర్లకోట క్లబ్ అధ్యక్షుడు మద్దిరాల శివ నాగకృష్ణ ,కార్యదర్శి అమలకంటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కర్రి ఆదినారాయణ, ఎస్ సత్యనారాయణ, సభ్యులు మేకా శ్రీను, సేపేని సురేష్, తదితరులు పాల్గొన్నారు.







