ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

* జాయింట్ కలెక్టర్ కీర్తి 
* వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ

UPDATED 3rd JUNE 2020 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సచివాలయ సిబ్బంది తమ విధులను నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి అన్నారు. స్థానిక 14,15 వార్డులకు సంబంధించిన వార్డు సచివాలయాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సచివాలయం జాబ్ చార్టును పరిశీలించిన అనంతరం ఆస్తి, నీరు, ప్రకటనలు, వాణిజ్య పన్నులు, వివాహాల రిజిస్ట్రేషన్, పార్కులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్ దరఖాస్తులు తదితర అంశాలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ ఆదినారాయణరావు, మున్సిపల్ మేనేజర్ నాగేశ్వరరావు, శానిటరీ ఇనస్పెక్టర్ డేవిడ్ రాజు, టీపీఎస్ ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ ఆర్ఐ మోహన్ రంగా, అసిస్టెంట్ ఇంజనీర్లు లక్ష్మీ బ్రహ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us