High Temperatures In AP: నిప్పుల కొలిమి..! అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

Updated 16th May 2023 Tuesday 7:40 am

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. రాత్రి 8గంటల తరువాత కూడా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సోమవారం వడదెబ్బ కారణంగా ముగ్గురు మరణించారు. అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు, వడగాల్పులు తీవ్రత కూడా ఎక్కుగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

ఈ రోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు..

ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల ప్రభావం మంగళవారం కూడా ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొమ్మిది మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం 18 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 131 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజుకూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us