Updated 20th April 2017 Thursday 1:30 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ అకుంఠిత దీక్ష ,కఠోర పట్టుదలతో రాష్ట్రాన్నిఅభివృద్ధి పధంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం కేక్ లు, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, మున్సిపల్ కౌన్సిలర్ త్సలికి సత్య భాస్కరరావు, ఆనూరు సర్పంచ్ సింగన అరవింద్ కుమార్, ఎంపిటిసి అడపా గంగాధరం, టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.







