UPDATED 23rd DECEMBER 2017 SATURDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆధ్వర్యంలో ఓపెన్ డెఫెకేషన్ అనే అంశంపై సూరంపాలెం గ్రామంలో శనివారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విభాగం సూరంపాలెం పరిసర గ్రామాలను వోడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ఈ అవగాహనా ర్యాలీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. తమ గ్రామాన్ని ఒడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మాణం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియచేస్తున్నామని, తమ గ్రామం త్వరలోనే ఒడిఎఫ్ గ్రామంగా గుర్తింపు పొందడానికి ఇటువంటి ర్యాలీలు ఎంతగానో దోహదపడతాయని సూరంపాలెం గ్రామ సర్పంచ్ కుంచే రాజా చినబాబు తెలిపారు. ఈ ర్యాలీలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎమ్.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, , వైస్ ప్రెసిడెంట్ ఎమ్.సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







