UPDATED 20th APRIL 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ఇటీవల కాశ్మీర్లో కథువా జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని, ఘటనకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బ్రౌన్ పేట నుంచి స్టేషన్ సెంటర్, మెహర్ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేసును త్వరితగతిన పరిష్కరించి నేరస్థులను కఠినంగా శిక్షించి భాదిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలనీ, దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు వినతపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.







