ఆదిత్యలో ముగిసిన ఫ్యాకల్టీ శిక్షణా తరగతులు

UPDATED 29th JUNE 2017 THURSDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమానికి హాజరైన కళాశాల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బ్రిటీష్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాకల్టీ శిక్షణా తరగతుల ద్వారా అధ్యాపకులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకోవడమే కాకుండా విద్యార్థులకు మరింత  చక్కని బోధన చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే అధ్యాపకులకు ఆంగ్ల భాషపై మరింతగా పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈ ఫ్యాకల్టీ తరగతిలో శిక్షణ పొందిన 26 మంది అధ్యాపకులను, శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ నీలిమను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us