Pawan Kalyan Key Comments : ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వం : పవన్ కళ్యాణ్

UPDATED 22nd AUGUST 2022 MONDAY 09:30 PM

Pawan Kalyan Key Comments : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అంటే.. చెప్పలేని స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నికల పొత్తుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చన్నారు. మోదీ, చంద్రబాబు ఇక అసలు కలవరు అనుకుంటే.. కలిశారని.. అలాగే ఏదైనా జరగొచ్చన్నారు.పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలోనూ వెన్నుపోటు నేతలు ఉన్నారని పేర్కొన్నారు. తమ పక్కనే కూర్చొని వెన్నుపోటు పొడుస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. బయటి శత్రువు అయితే కనిపెట్టవచ్చని… పక్కనే కూర్చొని వెన్నుపోటు పొడిస్తే పార్టీకి ఇబ్బందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.జనసేన సిద్ధాంతాలు నచ్చితేనే పార్టీలో ఉండాలన్న పవన్‌… లేదంటే స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు

రాష్ట్రాన్ని సరిదిద్దే ముందు పార్టీలో లోపాలు సరిదిద్దుతానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. సమయాన్ని బట్టి వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు. తమ స్ట్రాటజీ తమకు ఉందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us