రెడ్ బీ న్యూస్, 20 డిసెంబర్ 2021: బిల్లా’, ‘రెబల్’ తర్వాత ప్రముఖ నటులు కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో ఆయన కాషాయం రంగు వస్త్రాల్లో.. జపం చేస్తూ కనిపించారు. ఈ సినిమాలో ఆయన పరమహంస అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో కృష్ణంరాజు కొత్తగా కనిపించటంతో విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు.







