UPDATED 19th MAY 2022 THURSDAY 01:15 PM
Dr BR Ambedkar Konaseema : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరును మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనలు 30 రోజుల్లోగా తెలియజేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో అంబేడ్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.