UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 9:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల వెనుక గల స్వచ్ఛంద సంస్థ ఎస్.ఎం.ఎస్ ఆవరణలో నిర్వహించిన ఆరాధన కార్యక్రమంలో కాకినాడ ఎంపి తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువును ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందని అన్నారు. అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మన్యం చంద్రరావు, వై.సి.పి కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్, పట్టణ టిడిపి అధ్యక్షుడు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, గోలి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.







