Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ హోదా నాకిష్టం లేదు: చిరంజీవి

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022‌: తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆ హోదా తనకిష్టం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా సినీ కార్మికులు మాట్లాడుతూ.. ‘‘గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుంది’’ అని చిరంజీవిని కోరారు. కాగా, దానిపై స్పందించిన చిరు.. ‌‘‘పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దు. కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. అనవసరమైన వాటికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయితీ చేయను. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి వారి కోసం నిలబడతా’’ అని వ్యాఖ్యలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us