UPDATED 13th NOVEMBER 2022 SUNDAY 11:10 AM
Trolling on Heroins : సోషల్ మీడియాను నిత్యం వేడెక్కించే అంశం ట్రోలింగ్. ప్రముఖ హీరోయిన్స్ డ్రెసింగ్, బాడీ షేమింగ్, పాత్రల ఎంపిక, ఫోటోషూట్స్ పై దుమ్మెత్తిపోస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇది మరీ ఎక్కువైంది. ఇప్పటి వరకూ ఎందరో హీరోయిన్స్ వీటి బారిన పడిన పడ్డారు. ఇటీవల ఆ లిస్ట్ మరింత పెరుగుతుంది.
ట్రోలింగ్ కల్చర్ అంతకంతకు విస్తరిస్తోందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా కథానాయికలపై హేట్ మెసేజ్ లు, దూషణలు ఆగకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఎందరో హీరోయిన్స్ నిత్యం ట్రోలింగ్ బారిన పడుతునే ఉన్నారు. సినిమాల నుంచి పర్సనల్ విషయాల వరకూ పాయింట్ అవుట్ చేస్తూ ఎందరినో ఆవేదనకు గురి చేస్తున్నారు ట్రోలర్స్. ఎంతగా చర్యలు తీసుకుంటున్నా వీటికి అడ్డు కట్ట వేయలేకపోతున్నారు.
ఇటీవలే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ట్రోలింగ్ బారిన పడడంతో ట్రోలర్లపై ఒక లాంగ్ నోట్ రాసింది. ఓ వైపు టాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రష్మిక నేషనల్ క్రష్ గా బోలెడంత పాపులరైంది. కానీ ఇటీవల ‘గుడ్ బై’ మూవీతో ఫ్లాప్ ని ఎదుర్కొంది. దాంతో తనపై ట్రోలింగ్ అమాంతం పెరిగింది. దీంతో కలత చెందిన రష్మిక సోషల్ మీడియా తో తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్ధేశించి ఒక సుదీర్ఘ నోట్ రాసింది. ఇంటర్నెట్ లో ద్వేషాన్ని ఎదుర్కోవడం ‘హృదయ విదారకం’. ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని కోట్ చేసింది రష్మిక. ఇంటర్నెట్ లో తప్పుడు కథనాలు వ్యాప్తి చెందుతున్నాయని, ఇది తనకు పరిశ్రమలో అలాగే పరిశ్రమేతర సంబంధాలకు చాలా హానికరం అని ఎత్తి చూపింది.
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ తనని సామాజిక మాధ్యమాల్లో ద్వేషించేవారిని ఉద్ధేశించి మాట్లాడుతూ ఇలాంటి విష సంస్కృతి అంత మంచిది కాదని మండిపడింది. తనను కొందరు ‘మంత్రగత్తె’ అని కూడా ట్రోల్ చేశారని కానీ నేను వేటినీ పట్టించుకునే స్థితిలో లేనని కూడా శ్రుతిహాసన్ రియాక్టయింది.







