UPDATED 23rd NOVEMBER 2017 THURSDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రమాశ్రీ ని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో దశాబ్ధానికి పైగా సేవలందిస్తున్న డాక్టర్ రమాశ్రీ రీమా ధారేజాతో కలిసి సంయుక్తంగా రచించిన "అడ్వాన్సుడ్ డేటా స్ట్రక్చర్" అనే పుస్తకం ప్రముఖ ప్రచురణ సంస్థ ఆక్స్ ఫర్డ్ ద్వారా విడుదలైన మొదటి సంచిక ద్వితీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డాక్టర్ రమాశ్రీని కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, ఎ.రామకృష్ణ, విభాగాధిపతులు, తదితరులు అభినందించారు.







